వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీలో పలువురిని నియమించారు. 9 కమిటీల్లో 27 మందికి చోటు కల్పించారు. అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలోని ఐదు క్లస్టర్లకు అధ్యక్షులను, విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 6, 43, 53,54, 55వ వార్డులకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జిల్లా స్థాయి నియామకాలు
జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడిగా మేరుగ గణేష్, జిల్లా బీసీ సెల్ కమిటీ ఉపాధ్యక్షుడిగా దూడ ధనంకొండ, జిల్లా ఆర్టీఐ వింగ్ కమిటీ కార్యదర్శిగా కూరందాస్ సింహాచలం, జిల్లా వాణిజ్య విభాగం కమిటీ కార్యదర్శిగా సూరాడ పెంటారావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ కమిటీ కార్యదర్శిగా తవ్వార్ క్షేత్రపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా దూడపాటి రాజేశ్వరి, జిల్లా సోషల్ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శిగా గుడాల బాబూరావు, కార్యదర్శిగా దామోదర ఈశ్వరరావు, జిల్లా పబ్లిసిటీ వింగ్ కమిటీ కార్యదర్శిగా దుంప పోలిరెడ్డి, జిల్లా దివ్యాంగుల విభాగం కమిటీ కార్యదర్శిగా కొట్టిన నాగ భీమ కొండలరావును నియమించారు. జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నక్కన రాజ్‌కుమార్ యాదవ్, కార్యదర్శులుగా పల్లా శ్రీనివాస్, మీసాల ప్రదీప్ నియమితులయ్యారు. జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా చెరుకూరి రజిని, డాక్టర్ చప్పిడి వెంకట సత్య, కార్యదర్శిగా పేర్ర మాసేనమ్మను నియమించారు. జిల్లా లీగల్ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సూరిశెట్టి అనిల్‌కుమార్, కార్యదర్శిగా ఆరిపాక రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.గోపాలరావు, దువ్వాడ పూర్ణచంద్ర శేఖర్ నియమితులయ్యారు. జిల్లా వైఎస్సార్‌టీయూసీ కమిటీ కార్యదర్శులుగా కోరాడ శ్రీనివాసరావు, ఎస్.వి.వి.కమలనాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కె.అర్జున్‌ను నియమించారు. జిల్లా వలంటీర్ వింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శరగడం వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శిగా బాలిరెడ్డి శ్రీనివాసరావు, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నియమితులయ్యారు.


