రుషికొండ బీచ్‌లో పారాగ్లైడింగ్ ప్రారంభం
కొమ్మాది: పర్యాటకులను మరింతగా ఆకర్షించే లక్ష్యంతో రుషికొండ బీచ్‌లో పారా గ్లైడింగ్ ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. గురువారం రుషికొండ బీచ్‌లో పారా గ్లైడింగ్‌ను ప్రారంభించి మాట్లాడారు. రుషికొండ బీచ్‌ను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులను అన్ని విధాలా ఆకట్టుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన బీచ్‌లో కలియతిరిగారు. కార్తీక మాసం కావడంతో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుందని, లైఫ్‌గార్డ్స్, మైరెన్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


