చిరువ్యాపారులపై ఆంక్షల తొలగింపు
విశాఖ సిటీ: నగరంలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో బీచ్ రోడ్డులో చిరువ్యాపారుల దుకాణాలు మూసివేయాలని జారీ చేసిన ఆంక్షలను ఎత్తివేశారు. ఏయూలో సదస్సు జరుగుతుండగా బీచ్ రోడ్డులో దుకాణాలు మూయించి చిరువ్యాపారుల పొట్ట కొట్టడం పట్ల ‘పేదలకు పస్తులు.. సమ్మిట్‌తో గొప్పలు’ కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం, జీవీఎంసీ దిగొచ్చింది. బీచ్ రోడ్డులో ప్రధాన మార్గంలో కాకుండా సర్వీస్ రోడ్డులో యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు చెప్పారు. దీంతో గురువారం రాత్రి నుంచి బీచ్ రోడ్డులో చిరు వ్యాపారాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.


