మాకు రంగులే ముఖ్యం!
నగరంలో అత్యంత రద్దీగా ఉండే గురుద్వార కూడలి సమీపంలోని ప్రధాన కాలువ వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రహదారి భారీగా కుంగిపోయి, పగుళ్లు ఏర్పడటంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. వాహనాల రాకపోకలకు ఆటంకం, ముప్పు తప్పదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. జీవీఎంసీ అధికారులు రోడ్డు మరమ్మతులను పూర్తిగా విస్మరించారు. భాగస్వామ్య సదస్సు కోసం రోడ్డు భద్రతను పక్కన పెట్టి.. డివైడర్లకు రంగులు వేసి, నగరాన్ని అలంకరించడంపైనే దృష్టిసారించారు. జీవీఎంసీ తీరు ‘మాకు రంగులే ముఖ్యం.. రోడ్డు వాదు’ అన్నట్లుగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


