పలు రైళ్లకు హైటెక్ సిటీలో హాల్ట్
తాటిచెట్లపాలెం: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకార్యర్ధం పలు రైళ్లకు తాత్కాలికంగా దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ డివిజన్ పరిధి హైటెక్ సిటీ స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు.
● లింగంపల్లి–విశాఖపట్నం(12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం 6.21 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి 6.22 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఆయా తేదీల్లో రాత్రి 7.14 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి రాత్రి 7.15 గంటలకు బయల్దేరుతుంది.
● విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్(18519)ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ జనవరి 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మధ్యాహ్నం 1.14 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి 1.15 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 7.34 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి 7.35 గంటలకు బయల్దేరుతుంది.
పలు రైళ్లకు హైటెక్ సిటీలో హాల్ట్


