ఫైర్
పీపీపీపై
చంద్రబాబు ప్రభుత్వంపై
వెల్లువెత్తిన ప్రజాగ్రహం
ప్రభుత్వ తీరుపై
నియోజకవర్గ కేంద్రాల్లో
నిరసన
సాక్షి, విశాఖపట్నం: పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను.. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏడు నియోజకవర్గాలు నిరసనలతో హోరెత్తాయి. ప్రభుత్వ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ఈ నిరసనల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని.. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉత్తర నియోజకవర్గంలో బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు, ప్రజలు వెనక్కి తగ్గకుండా పాదయాత్రగా తమ నిరసనను కొనసాగించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భీమిలి నియోజకవర్గంలో..
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ జరిగింది. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర, ఎస్‌ఈసీ సభ్యులు పోతిన హనుమంతురావు, దాట్ల పెదబాబు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
విశాఖ ఉత్తరలో..
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో గురుద్వారా జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ర్యాలీ జరిగింది. పోలీసులు తొలుత బైక్ ర్యాలీని అడ్డుకోవడంతో, నేతలు, కార్యకర్తలు పాదయాత్రగా నిరసన కొనసాగించారు. ఎమ్మెల్సీ పి.రవీంద్ర బాబు, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, డిప్యూటీ మేయర్ సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, ముఖ్య నేతలు రొంగలి జగన్నాథం, సతీష్ వర్మ, రవిరాజు, పేడాడ రమణికుమారి, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణలో..
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏవీఎన్ కాలేజీ డౌన్ నుంచి చౌల్ట్రీ వరకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 ర్యాలీ జరిగింది. చౌల్ట్రీ వద్ద తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్‌ఐకు వినతిపత్రం అందజేశారు. సీఈసీ
మెంబర్ కోలా గురువులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, చెన్నా జానికీరామ్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ తూర్పులో..
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు నేతృత్వంలో డెయిరీ ఫారం నుంచి రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జి.విక్టర్, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి వానపల్లి ఈశ్వరరావు, రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ పశ్చిమలో..
నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో గాజువాక డిపో నుంచి ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
గాజువాకలో..
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
పెందుర్తి నియోజకవర్గంలో..
మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో సబ్బవరం జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ర్యాలీ చేశారు. డీటీ అప్పారావుకు వినతిపత్రం సమర్పించారు. ముఖ్య నేతలు శరగడం చినఅప్పలనాయుడు, గండి రవి తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై భగ్గుమన్న విశాఖ
ఫైర్
ఫైర్
ఫైర్
ఫైర్
ఫైర్
ఫైర్


