గ్రేటర్‌పై సమ్మిట్ పోటు
నగరంలో 14, 15 తేదీల్లో
సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్
మైదానంలో ఏర్పాట్లు
సుందరీకరణ పనులకు పైసా కూడా
విదల్చని చంద్రబాబు ప్రభుత్వం
జీవీఎంసీపై రూ.42 కోట్ల భారం
విశాఖను పసుపుమయం చేసేసిన
అధికారులు
హడావుడిగా రోడ్ ప్యాచ్ వర్క్‌లు
8లో
విశాఖ సిటీ: గ్రేటర్‌పై సమ్మిట్ పోటు పడింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో జీవీఎంసీపై చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్ల భారం మోపింది. ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నట్లు డప్పులు కొట్టుకుంటున్న సర్కార్.. నిర్వహణకు మాత్రం పైసా కూడా విదల్చకుండా చేతులు దులుపుకుంది. దీంతో అరకొర పనులతోనే హడావుడిగా ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు ఇలా మొత్తంగా 3 వేల మంది హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎప్పటిలాగే గత వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన ఒప్పందాలను కూడా తమ ఖాతాలో వేసుకొని రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఊదరగొడుతోంది. ఈ సదస్సుకు విశాఖను సుందరంగా ముస్తాబు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసేసింది. సదస్సు నిర్వహణకు గాని, విశాఖ సుందరీకరణకు గానీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.
జీవీఎంసీపై రూ.42 కోట్ల భారం
ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు విశాఖ సుందరీకరణపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీవీఎంసీ ఖజానా నుంచే నిధులు వెచ్చిస్తున్నారు. నగరంలో కొత్త రోడ్లు కాకుండా ముందుగా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫుట్‌పాత్, డివైడర్లు, రైలింగ్ మరమ్మతులు చేశారు. అలాగే నగరానికి పుసుపు రంగు పులిమేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, రైలింగ్‌లకు తెలుపు, నలుపు రంగులు వేశారు. ఇప్పుడు తెలుపు రంగు స్థానంలో పసుపు రంగులు వేశారు. నగరాన్ని పసుపుమయంగా మార్చేశారు. ఈ సుందరీకరణ పనులకు సంబంధించి జీవీఎంసీ ఖజానాపై రూ.42 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది.
కొందరికే ఆహ్వానంపై అనుమానాలు
భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని బాకాలు ఊదుతున్న ప్రభుత్వం ఈ సదస్సుకు కొందరినే ఆహ్వానించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ఇదే తరహాలో పెట్టుబడుల సదస్సు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసి ఈవెంట్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా బడా పారిశ్రామికవేత్తలుగా చూపించారు. ఎవరూ కనిపెట్టలేరన్న భ్రమలో వారికి సూటు, బూటు వేసి స్టేజ్ ఎక్కించారు. ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఫొటోలకు పోజులిచ్చారు. వెంటనే ఆ ఒప్పందాలు చేసుకున్న నకిలీ పారిశ్రామికవేత్తల అసలు బండారం సోషల్ మీడియా ద్వారా బయటపడింది. దీంతో ఈసారి గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు మినహా.. మిగిలిన ఒప్పందాలపై గోప్యత పాటించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఊరు, పేరు లేని ఉర్సా కంపెనీకి భూములు అప్పనంగా కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ పెట్టుబడుల సదస్సులో ఒప్పందాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులకు కారుచౌకగా భూముల పందేరం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు విమర్శలు సంధిస్తున్నారు. దీని కారణంగానే ఈ సదస్సుకు కేవలం టీడీపీ శ్రేణులు, వారి అనుచరులను మాత్రమే ఆహ్వానిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు.
బీచ్ రోడ్డులో చేసిన ప్యాచ్ వర్క్‌లు
సీఐఐ సదస్సు సందర్భంగా
ట్రాఫిక్ మళ్లింపు
జీవీఎంసీ టెండర్ల విచిత్రం
సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ చేపట్టిన పనులకు సంబంధించి టెండర్లలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు ముందుగానే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ అధికారులు విచిత్రంగా కొన్ని పనులకు సంబంధించి బుధవారం షార్ట్ టెండర్లను ఆహ్వానించడం విశేషం. ఏయూలో పార్కింగ్ కోసం భాస్కర్, న్యూటన్, సమతా హాస్టల్స్ వద్ద మైదానాలను లెవెలింగ్‌కు, మద్దిపాలెంలో ఏయూ ఎంట్రన్స్ ఆర్చ్ వద్ద ఫుట్‌పాత్ టైల్స్, కెర్బ్‌వాల్ మరమ్మతులు, ట్రాఫిక్ ఐల్యాండ్ మ్యూరల్ ఆర్ట్స్ పెయింటింగ్... ఇలా పనులకు షార్ట్ టెండర్లు పిలిచారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. 15 తేదీ సాయంత్రానికి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ముగుస్తుంది. అప్పుడు టెండర్లు ఖరారు చేసి సదస్సుకు సుందరీకరణ పనులు చేపడ్డమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
గ్రేటర్‌పై సమ్మిట్ పోటు
గ్రేటర్‌పై సమ్మిట్ పోటు
గ్రేటర్‌పై సమ్మిట్ పోటు


