తుది దశకు ఏర్పాట్లు
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం జర్మన్ హ్యాంగర్లతో 8 హాళ్లు నిర్మించారు. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సుమారు 3 వేల మంది హాజరవుతున్నట్లు భావిస్తున్నారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా 14వ తేదీన సదస్సును ప్రారంభించనున్నారు. అలాగే దీనికి రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఏయూ పరిసర ప్రాంతాలను నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌తో పాటు వీఐపీలు పర్యటించే, బస చేసే హోటళ్ల వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.


