వాహనమిత్ర డబ్బులు మాకెందుకు వేయలేదు?
గోపాలపట్నం: సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వింత అనుభవం ఎదురైంది. చాలా మంది పార్టీ శ్రేణులు సార్ సార్ అంటూ పిలుస్తుండగా కొందరు ఆటో డ్రైవర్లు మాత్రం వాహనమిత్ర డబ్బులు మాకెందుకు వేయలేదంటూ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ అనుకూలురికి, ఆ పార్టీల నేతలకు కావాల్సిన ఆటో డ్రైవర్లకే వాహనమిత్ర డబ్బులు జమచేశారని, అర్హత ఉన్నా తమకు ఎందుకు డబ్బులు వేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం సమాధానం చెప్పకుండా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం వైపు వెళ్లిపోయారు. దీంతో సదరు ఆటో డ్రైవర్లు నిరాశగా వెనుదిరిగారు.


