సదస్సు ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఈ మేరకు ఏర్పాట్లపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఉప రాష్ట్రపతి సెక్యూరిటీ ఆఫీసర్ సింగ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర ఉన్నత అధికారులు వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో సమీక్ష చేశారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.


