రెవెన్యూ క్రీడల్లో విశాఖకు ద్వితీయ స్థానం
మహారాణిపేట: అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక పోటీలు – 2025లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానం సాధించింది. ఈ క్రీడా పోటీలలో జిల్లా రెవెన్యూ సిబ్బంది తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పురుషుల విభాగంలో... జూనియర్ అసిస్టెంట్ రవివర్మ 100 మీటర్ల పందెంలో ప్రథమ స్థానం కై వసం చేసుకు న్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో టి. ఉదయ్, ఎస్. రోహిత్ జట్టుతో పాటు సింగిల్స్ విభాగంలో కూడా విశాఖ జట్టు ప్రథమ స్థానాలు దక్కించుకుంది. మహిళల విభాగంలో... షాట్‌పుట్‌లో ఇ. ప్రసన్న ప్రథమ స్థానం సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్, చెస్, టగ్ ఆఫ్ వార్ విభాగాల్లో మహిళా జట్లు ద్వితీయ స్థానాలను సాధించాయి. కలెక్టరేట్ ఆఫీస్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ అధికారులు సహా వివిధ హోదాల్లోని సిబ్బంది సమష్టి కృషి, క్రీడాస్ఫూర్తి ఫలితంగానే విశాఖ జట్టుకు రెండో స్థానం దక్కిందని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు తెలిపారు.


