‘చిరంజీవ’ సూపర్ హిట్ అవడం ఆనందంగా ఉంది
బీచ్‌రోడ్డు: లవర్ బాయ్ రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’ ఓటీటీలో సూపర్ హిట్ అయిన సందర్భంగా నగరంలో చిత్ర యూనిట్ విజయయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ... ఆహాతో తనకు మంచి అనుబంధం ఉందని, గతంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయిందని గుర్తు చేసుకున్నారు. నవంబర్ 7న విడుదలైన ‘చిరంజీవ’ చిత్రాన్ని ఆహాలో సబ్‌స్క్రైబ్ చేసుకొని చూడాలని కోరారు. దర్శకుడు అభి మా అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడని, ఈ విజయాన్ని దక్కించుకోవడానికి అతను అర్హుడని ప్రశంసించారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో 23 ఏళ్ల ప్రయాణంలో దర్శకుడిగా తన కృషికి ఆహా టీమ్ (శ్రావణి), నిర్మాతలు రాహుల్, సుహాసిని ఎంతగానో సహకరించారని తెలిపారు. ‘జబర్దస్త్’ స్కిట్స్ మాదిరిగానే, ఈ సినిమాలో కూడా హీరోకు ఏజ్ మీటర్ అనే కొత్త కాన్సెప్ట్‌ను పెట్టి ప్రయత్నించానని, ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


