భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు ఆకర్షిస్తాం
ఎంవీపీకాలనీ: సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ ద్వారా 410 ఎంవోయూలు, రూ. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ తెలిపారు. సోమవారం లాసన్స్ బే కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమ్మిట్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, మెజారిటీ ప్రాజెక్టుల గ్రౌండింగ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నవంబర్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆర్కే బీచ్, గాజువాకల్లో యూనిటీ మార్చ్‌లు నిర్వహిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు.


