యువతను ఆకర్షించేలా కొత్త ‘హ్యుందాయ్ వెన్యూ’
సీతంపేట: ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ శ్రీ జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్(లక్ష్మీ హ్యుందాయ్) ఖాతాదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త మోడల్ కార్లు ఆల్–న్యూ హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. రామాటాకీస్ సమీపంలోని హ్యుందాయ్ షోరూంలో షిఫ్ట్‌వేవ్ టెక్నాలజీస్ సీఈవో, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరత్ నల్ల చేతులమీదుగా శుక్ర వారం నూతన వాహనాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హ్యుందాయ్ క్లస్టర్ హెడ్ మిసోమనాథ్ లాల్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక, భద్రతా ప్రమాణాలతో అద్భుతమైన ఈ రెండు కొత్త మోడల్ కార్లను వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఆల్–న్యూ హ్యుందాయ్ వెన్యూ మోడల్ రోడ్డుపై పెద్ద ఎస్‌యూవీ అనుభూతినిస్తుందని, ఇది మునుపటి వెన్యూ మోడల్ కంటే 48 ఎంఎం ఎత్తుగా, 20 ఎంఎం వీల్‌బేస్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇందులో 65 కంటే ఎక్కువ అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయని వివరించారు. వెన్యూ ఎన్ లైన్‌లో పెర్ఫార్మెన్స్ కంట్రోల్ బటన్లతో కూడిన స్టీరింగ్ వీల్, వింగ్ రకం స్పాయిలర్, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు మరింత స్పోర్ట్స్ లుక్‌ను ఇస్తాయని పేర్కొన్నారు. ఆల్–న్యూ హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధరలు రూ.7,89,900(ఎక్స్ షోరూం) నుంచి మొదలవుతాయని వివరించారు. కార్యక్రమంలో జీఎం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ జి.కిశోర్‌కుమార్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.


