మహిళలను కాపాడిన లైఫ్‌గార్డులు
ఏయూక్యాంపస్ : ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు మహిళలను లైఫ్‌గార్డులు రక్షించారు. గురువారం ఉదయం గోకుల్‌పార్క్ వద్ద మహారాణిపేటకు చెందిన కీర్తి ఉషారాణి, అంకంరాజు సునీత సముద్రంలో పూజా సామగ్రి కలపడానికి వచ్చారు. కెరటాల తీవ్రతకు వారు సముద్రంలోకి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వెంటనే స్పందించారు. లైఫ్‌గార్డులు ఆనంద్, రాజులకు సమాచారం అందించి వారి సహాయంతో సముద్రంలోకి వెళ్లిపోతున్న మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిని బంధువులకు అప్పగించినట్లు పోర్ట్ సిఎస్‌పిఎస్ ఎస్‌ఐ బి.కె.వి.ప్రసాద్ తెలిపారు.


