రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై వ్యక్తి మృతి
తగరపువలస : స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్ ఎదురుగా గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన జంపా అచ్యుతరావు(32) అక్కడికక్కడే మృతి చెందాడు. అచ్యుతరావు రోడ్డు దాటుతుండగా అంబేడ్కర్ కూడలి నుంచి బంగామెట్ట వైపు చిట్టివలస శారదా పబ్లిక్ స్కూల్ బస్సు వెళ్తుంది. డివైడర్ పైనుంచి వెళ్తున్న అతడు బస్సు వెళ్తున్న రోడ్డుపై పడిపోగా.. వెనుక టైరు, డివైడర్ మధ్య రాపిడికి గురై తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిట్టివలసలో నివసిస్తూ స్థానికంగా దేవీ స్వీట్స్ కార్ఖానాలో పనిచేస్తున్నాడు. ఎస్‌ఐలు భరత్‌కుమార్ రాజు, బి.తిరుపతిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్‌రోడ్డులో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై వ్యక్తి మృతి


