రేపటి నుంచి వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్
బీచ్‌రోడ్డు: లిట్ లాంటర్న్ కల్చర్ అండ్ లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ 2025 బీచ్‌రోడ్డులోని హవామహల్ వేదికగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్లు సోనాల సర్దా, సంధ్యా గోడే, ప్రియ తెలిపారు. సిరిపురంలోని ఒక హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్‌లో 20 మంది ప్రముఖ స్టోరీ టెల్లర్స్ పాల్గొంటారన్నారు.
ప్రతి రోజూ సుమారు 50 సెషన్లు ఉంటాయని తెలిపారు. 4 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థుల కోసం ఎక్కువ సెషన్లు నిర్వహిస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆనందించే సెషన్లు కూడా ఉంటాయన్నారు. ఫెస్ట్ పోస్టర్‌ను కంకటాల మల్లికార్జునరావు ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా చిన్నారుల కోసం ఈ ఫెస్ట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే 2 వేల విద్యార్థులు తమ పేర్లును నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వేదిక వద్ద కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు.


