● కార్తీక శోభ
ఎంవీపీ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక మాసం ఆరంభమైంది... పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో తొలి సోమవారం నగరంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జాము నుంచే భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉపవాస దీక్షతో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూలైన్లలో నిలబడి శివనాథుడ్ని దర్శించుకున్నారు. శివలింగానికి పాలధారతో అభిషేకం చేస్తూ, బిల్వదళాలతో పూజలు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. పలు ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణతో, భక్తుల జయజయధ్వానాలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా నగరమంతా శివతత్వంతో నిండిపోయింది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పాత రేసపువానిపాలెం శివాలయంలో ప్రత్యేక పూజలు
● కార్తీక శోభ
● కార్తీక శోభ
● కార్తీక శోభ


