దొంగనోట్ల కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ఎంవీపీకాలనీ: నగరంలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును ఇటీవల రట్టు చేసిన కేసులో ఎంవీపీ పోలీసులు మరో ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్‌కు పంపారు. ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహామూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీరామ్ అలియాస్ గుప్తాను ముందుగా అరెస్టు చేశారు. తాజాగా పాల వరప్రసాద్, కొత్త ఆనంద్, కొప్పల గంగాధర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని, గతంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎంవీపీ, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు కార్యక్రమంలో ఎంవీపీ సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


