
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతి
డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ హరప్రసాద్
మద్దిలపాలెం : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.వి.హర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్‌ఎస్‌టీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకడమిక్ కాన్ఫరెన్స్–2025ను శుక్రవారం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలు సమర్ధవంతంగా వినియోగించి సత్ఫలితాలను సాధించిన విధానాన్ని వివరించారు. డీఆర్‌డీవో సమిష్టిగా విశ్వవిద్యాలయాలు సాంకేతిక విద్యాసంస్థలతో కలసి పరిశోధనలు నిర్వహించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100 విద్యాసంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో భాగస్వామ్యం అయ్యారన్నారు. నీటిలోపల లోతైన ప్రదేశంలో సమాచారాన్ని సంగ్రహించి, విశ్లేషించే నూతన వ్యవస్థలు, స్టైల్త్ టెక్నాలజీ, సెన్సార్లు వంటివి దేశీయంగా అభివృద్ధి చేయడం, వినియోగించడం జరుగుతోందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ సాంకేతికతలో స్వీయ వికాసం కలిగి ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి నూతన ప్రొజెక్టర్ టామ్‌సేజ్ సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలో పెరగాలని సూచించారు. ఐడీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ మను కోరుల్లా వర్చువల్ విధానంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో 100 పేటెంట్లు సాధించడం లక్ష్యంగా కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య టి.వి.కె భానుప్రకాష్, ఏఐఓ, ఎన్‌ఎస్‌టీఎల్ శాస్త్రవేత్త విఎప్ సాజీ, డిప్యూటి శాస్త్రవేత్త టి.వేణుగోపాలరావు, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తదితరులు ప్రసంగించారు.