
గళమెత్తిన కలం
విశాఖపట్నం
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్ట్‌ల భారీ నిరసన
9
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
‘సాక్షి’పై
దాడులను
ఆపాలని
డిమాండ్
డాబాగార్డెన్స్: ‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్ట్‌లు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జికి బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్ట్‌లు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్యల ద్వారా జర్నలిజాన్ని భయపెట్టలేరని హెచ్చరించారు. ప్రభుత్వం తన దాష్టీకాన్ని ఆపి, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్‌లు కె.చంద్రమోహన్, డి.హరనాథ్, యర్ర నాగేశ్వరరావు, ఇరోతి ఈశ్వరరావు, బి.ఆనందరావు, పీఏ రావు, రామునాయుడు, సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, కింతాడ మదన్‌తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్‌లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గళమెత్తిన కలం

గళమెత్తిన కలం