
వివాహిత దారుణ హత్య
తాటిచెట్లపాలెం: ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి నందగిరినగర్‌లో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫోర్త్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... కవల శ్రావణసంధ్యారాణి అలియాస్ సోనీ అక్కయ్యపాలెం నందగిరినగర్‌లో నివసిస్తోంది. భర్త మణికంఠతో విభేదాల కారణంగా గత ఏడేళ్లుగా వేరుగా ఉంటుంది. బుధవారం సాయంత్రం ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఖండిపల్లి శ్రీను అలియాజ్ పెయింటర్ శ్రీనుతో చిన్న వివాదం తలెత్తింది. కోపోద్రేకుడైన శ్రీను కార్పెంటర్లు ఉపయోగించే కత్తితో శ్రావణి మెడకోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోర్త్‌టౌన్ పోలీసులు, క్లూస్ టీం సభ్యులు దర్యాప్తు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోర్త్‌టౌన్ పోలీసులు కేసు విచారిస్తున్నారు.