
విశాఖ రైల్వేస్టేషన్‌లో జీఎం తనిఖీలు
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) పరమేశ్వర్ ఫంక్‌వాల్, వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రాతో కలిసి విశాఖపట్నం స్టేషన్‌లో పర్యటించారు. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను, పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. రిజర్వేషన్ కార్యాలయం, జనరల్ బుకింగ్ కార్యాలయం, క్యాప్సూల్ హోటల్, కేటరింగ్ స్టాల్స్‌ను తనిఖీ చేశారు. ప్లాట్‌ఫాంలు, పాదచారుల వంతెనలను పరిశీలించారు. ఎస్‌ఎంవీటీ బెంగళూరు–హతియా ఎక్స్‌ప్రెస్‌లో ఆన్‌బోర్డ్ తనిఖీలు చేపట్టారు. అనంతరం మర్రిపాలెంలోని మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ శిక్షణ పొందుతున్న వారితో, ఫీల్ట్ సిబ్బంది, సూపర్‌వైజర్స్‌తో ముఖాముఖి మాట్లాడారు. డీజిల్ లోకోషెడ్‌లో పర్యటించిన జీఎం ఆక్కడి సిబ్బంది చేపట్టిన నూతన ఆవిష్కరణలను పరిశీలించి, అభినందించారు. న్యూకోచింగ్ కాంప్లెక్స్, ప్యాంట్రీకార్‌లను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట వాల్తేర్ డివిజన్ ఉన్నతాధికారులు ఉన్నారు.