
టీఎన్‌ఏఐ పోస్టర్ ఆవిష్కరణ
విశాఖ సిటీ: ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ) 31వ రాష్ట్ర ద్వైవార్షిక సమావేశాలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అసోసియేషన్ అడ్వైజర్, గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సత్యవల్లి, సెయింట్ లూక్స్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ కార్యదర్శి ఎం.ప్రీతం లూక్ మాట్లాడుతూ ‘లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో–ది జర్నీ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్’ థీమ్‌తో సమావేశాలను బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలల ప్రతినిధులు, విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.