
సాక్షి ఎడిటర్‌పై వేధింపులు సరికాదు
సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం, తాజాగా ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం కక్ష సాధింపులో ఓ భాగమే. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ నేత మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురించడంపై కూడా కేసు పెట్టడం, నోటీసుల పేరిట వేధించడం సబబు కాదు. భారత రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. అన్యాయాన్ని, అవినీతిని, ప్రజా సమస్యలను తన కలంతో వెలికితీయడమే జర్నలిస్టుల వృత్తి. అలాంటి పత్రికా స్వాతంత్య్రాన్ని, జర్నలిస్టుల కలాన్ని పోలీసు కేసులతో నియంత్రించాలని చూస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏదైనా వార్త అవాస్తవమని భావిస్తే, దానికి ప్రభుత్వం వివరణ కోరాలి. కానీ కేసులు నమోదు చేయడం సరైంది కాదు. – సీహెచ్‌బీఎల్ స్వామి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా