
రాజమండ్రి, కాకినాడకు ఎక్స్‌ప్రెస్‌లు నడపాలి
డయల్ యువర్ ఆర్‌ఎంకు స్పందన
అల్లిపురం : ఏపీఎస్‌ఆర్టీసీ విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఆర్‌ఎమ్ ప్రోగ్రామ్‌కు స్పందన లభించింది. ప్రయాణికులు ఆర్టీసీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఆర్‌ఎం తెలిపారు. విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా తక్కువ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని.. తగినన్ని బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరారు. రాత్రి వేళలో సిటీ బస్సులు అదనపు ట్రిప్పులు నడపాలని కొందరు ప్రయాణికులు కోరారు. ద్వారకా బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, రామాటాకీస్ వరకు ప్రైవేట్ బస్సులు ఆపకుండా అరికట్టడంపై పలువురు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 18 మంది ఫోన్ చేశారని.. వారి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.