ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన

Sep 6 2025 7:11 AM | Updated on Sep 6 2025 7:11 AM

ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన

ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన

అల్లిపురం: దేశంలోని వివిధ రాష్ట్రాలలో పేరు గాంచిన చీరలు, వస్త్రాల అమ్మకాలు గ్రీన్‌ పార్కు హోటల్లో నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో సంస్థ ప్రారంభించింది. ఈ ప్రదర్శన ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దసరా, వివాహాది వేడుకలకు అవసరమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్లు కలబోసిన విభిన్న వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో – ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌ సందర్శన షాపింగ్‌ చేయటంలోఒక అద్భుతమైన వస్త్రాల సంబరాన్ని చూసిన అనుభూతి పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement