
మరణించి నలుగురికి వెలుగునిచ్చి..
పెందుర్తి : బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి ఓ కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీను(40) క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి శ్రీను ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో శ్రీను సమీప బంధువు శరగడం రాము(కర్రల రాము) చొరవతో కుటుంబ సభ్యులు శ్రీను నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు శ్రీను నేత్రాలను సేకరించారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నేత్రదానం చేయిస్తున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ స్ఫూర్తిలో తాము ఈ నేత్రదానం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
అల్లిపురం: ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి ఒక మహిళ ఫొటోలు మార్ఫ్ చేసి న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ ఆ ఫొటోలు పోస్ట్ చేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. సాంకేతికత సహాయంతో సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. నగరానికి చెందిన ఒక మహిళకు గుర్తు తెలియని ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన ఫేస్‌తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోలు వచ్చాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన మార్ఫ్ చేసిన ఫొటోలు బాధితురాలి ఫాలోవర్స్ అందరికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తానని బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో బాధితురాలు భయాందోళనకు గురై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి సాధారణ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని.. ఆన్‌లైన్ అప్లికేషన్ ఉపయోగించి అశ్లీలంగా మార్ఫ్ చేసి మళ్లీ ఆమెకు పంపించింది నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సాంకేతికత సహాయంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

మరణించి నలుగురికి వెలుగునిచ్చి..