
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
మహారాణిపేట : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శుక్రవారం ఉదయం విశాఖలో జిల్లాలో ఘనస్వాగతం లభించింది. రాడిసన్ బ్లూ హోటల్‌లో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీలు శ్రీ భరత్, సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌లు గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. సదస్సు అనంతరం రుషికొండ హెలిప్యాడ్ నుంచి 11.50 గంటలకు ఉండవల్లికి తిరుగు పయనమయ్యారు.