
వసూళ్లపై శ్రద్ధ.. దేవుడిపై అశ్రద్ధ
8లో
పలు వసతిగృహాల్లో ఇదీ పరిస్థితి
కంచరపాలెం ఊర్వశి కూడలి సమీపంలోని గిరిజన బాలుర పోస్ట్‌మెట్రిక్ వసతిగృహంలో విద్యార్థులు నేలపై నిద్రపోతున్నారు. వర్షం పడినప్పుడు గదుల్లోకి నీరు చేరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
● సీతమ్మధార ఎస్సీ వసతి గృహంలో వాటర్‌ప్లాంట్ మూలకు చేరింది. పరిసరాలు అధ్వానంగా ఉన్నా యి. దుప్పట్లు, మంచాలు వంటి సౌకర్యాలు లేవు. ట్యాప్‌లు సరిగా లేక నీరు వృథా అవుతోంది.
● ఎంవీపీ కాలనీ సెక్టార్–4లోని బీసీ బాలికల వసతి గృహం దశాబ్దాలుగా అద్దె భవనంలో నడుస్తోంది. సురక్షిత తాగునీరు లేదు. ఇరుకు గదుల్లో నేలపై నిద్రపోతున్నారు.
● మాధవధారలోని గిరిజన వసతి గృహంలో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. ఇక్కడ 300 మంది వరకు విద్యార్థులకు వసతి కల్పించారు. వీరంతా నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుకుంటున్నారు. ఉదయం కళాశాలకు వెళ్లే సమయానికి వంట పూర్తికాక.. కేవలం అన్నంతోనే భోజనం తీసుకెళ్తున్నారు. ఉదయం 2 గంటలు మాత్రమే నీరు రావడంతో నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాగునీరు బ్లీచింగ్ వాసన వస్తోంది.
● తోటగరువు గాంధీనగర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ బాలుర హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 122 మంది విద్యార్థులు 120 చదరపు గజాల విస్తీర్ణంలోని రెండు గదుల్లో వసతి పొందుతున్నారు. తాగునీటి కష్టాలు, నేలపై నిద్ర, వైద్య సదుపాయాల కొరత వేధిస్తోంది.
● పెదగంట్యాడ మండలం నెల్లిముక్కులో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్‌తో పాటు బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్‌లో మొత్తం 89 మంది ఉండగా, నాలుగు గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గదిని కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఆయా గదుల్లో మంచాలు లేకపోవడంతో నేలపైనే విద్యార్థులు నిద్రపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
● 74వ వార్డు పరిధిలోని సిద్ధేశ్వరంలో బాలికల హాస్టల్ ఉంది. ఇందులో ఇంటర్ నుంచి బి.టెక్ చదువుతున్న 50 మంది విద్యార్థినులు ఉన్నారు. అద్దె భవనంలోనే ఈ హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు.
● సింహాచలం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో డార్మిటరీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది.
● పరవాడ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు సరఫరా చేయలేదు.
● కప్పరాడ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో లైట్లు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేయడం లేదు.
● భీమిలిలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు లేకపోవడంతో.. విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు.

వసూళ్లపై శ్రద్ధ.. దేవుడిపై అశ్రద్ధ

వసూళ్లపై శ్రద్ధ.. దేవుడిపై అశ్రద్ధ

వసూళ్లపై శ్రద్ధ.. దేవుడిపై అశ్రద్ధ

వసూళ్లపై శ్రద్ధ.. దేవుడిపై అశ్రద్ధ