
ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్‌చార్జి ఏపీపీగా రాజశేఖర్
విశాఖ లీగల్: నగరంలోని షెడ్యూల్ కులాలు, తెగల ప్రత్యేక న్యాయస్థానం ఇన్‌చార్జి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది భత్తి రాజశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యుటర్‌గా పని చేస్తున్నారు. ఈ కోర్టుతోపాటు ఎస్సీ, ఎస్టీ కోర్టులోని అన్ని క్రిమినల్ కేసులను ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏపీపీగా కొనసాగుతారు.