
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అన్ని స్థానాలు వైఎ
డాబాగార్డెన్స్: ప్రజాస్వామ్యబద్ధంగా జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు నిర్వహిస్తే పదికి పది స్థానాలు వైఎస్సార్ సీపీవేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు శనివారం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మకు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ స్థాయీ సంఘం ఎన్నికకు సంబంధించి 97 మందిని ఓటర్లుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఏప్రిల్‌లో జరిగిన మేయర్ అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ సీపీ జెండాపై గెలిచిన 27 మంది పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేయగా.. వారిపై అనర్హత వేటు వేయాలని ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. అంతేగాక హైకోర్టులో 27 మంది అనర్హత కేసు నడుస్తుండగా స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. టెక్నికల్‌గా 27 మందికి ఓటు హక్కు ఉంటే వైఎస్సార్ సీపీ బలం 59గా ఉన్నట్టేనని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం.. అధికార దుర్వినియోగం చేస్తేనే తప్పా.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరన్నారు. యాక్ట్ ప్రకారం విప్ జారీ చేయడం జరిగిందని, కోర్టును కూడా ఆశ్రయించామని, చట్ట ప్రకారం వారు (పార్టీ ఫిరాయించిన 27 మంది) అనర్హులని చెప్పారు. న్యాయ స్థానంలో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ విప్ తైనాల విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, రామునాయుడు, దౌలపల్లి ఏడుకొండరాలు, కోరుకొండ వెంకట రత్న స్వాతి దాస్, కటారి అనిల్‌కుమార్, భూపతిరాజు సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్, 41వ వార్డు అద్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
స్థాయీ సంఘ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు