
స్టాండింగ్ కమిటీ ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం జరిగింది. బుధవారం మద్దిలపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఆధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు హాజరయ్యారు. ఇటీవల జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ సీపీ విధించిన విప్‌ను ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లకు హైకోర్డు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేసే అంశంపై ఆ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో ఈ సమావేశంలో చర్చించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కటమురి సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షుడు రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్‌రావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, దౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకొండ వెంకట రత్న స్వాతి దాస్, కటారి అనిల్ కుమార్, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, తోట పద్మావతి, చెన్న జానకిరామ్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, భర్కత్ అలీ, కె.వి.శశికళ, జి.లావణ్య, పి.వి.సురేష్, బల్లా లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష, ఉరుకూటి రామచంద్రరావు, భూపతి రాజు సుజాత, కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్ , జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
అధ్యక్షతన కార్పొరేటర్లతో సమావేశం
పాల్గొన్న శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ, పార్లమెంట్
పరిశీలకుడు కదిరి బాబూరావు

స్టాండింగ్ కమిటీ ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష