
మోసం చంద్రబాబు జన్మహక్కు
పెందుర్తి: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబు తన జన్మహక్కులా భావిస్తారని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ పరిశీలకురాలు శోభా హైమావతి విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇవ్వడం, గెలిచాక ప్రజలను వంచన చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు వేరెవరూ లేరని ఎద్దేవా చేశారు. సుజాతనగర్‌లో పెందుర్తి గ్రామీణ, పట్టణ స్థాయి ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండో ఏడాది నడుస్తున్నా ఒకటి రెండు పథకాలు కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. రాష్ట్రంలో పేదలకు తగిన సహకారం అందాలన్న సంకల్పంతో గతంలో సీఎంగా వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు. ఏడాది తిరగకముందే చంద్రబాబు తత్వం ప్రజలకు బోధపడిందన్నారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టాలన్న దురుద్దేశంతోనే మంత్రి అచ్చెన్నాయుడు ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలన్న వాఖ్యలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ కేడర్ నడుం బిగించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ నమ్మకం పేరు చేబితే వైఎస్ జగన్ గుర్తుకు వస్తారని.. మోసం పేరు చెబితే చంద్రబాబు గుర్తుకు వస్తారని విమర్శించారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎన్నికల్లో సూపర్‌సిక్స్‌తో పాటు 143 హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని.. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దాన్ని బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కూటమి నాయకులకు అవినీతి, అక్రమాలు, కబ్జాలు చేయడం తప్ప ప్రజా సంక్షేమం పట్టడంలేదన్నారు. త్వరలో పార్టీలో పూర్తిస్థాయి కమిటీలు వేస్తామని ప్రకటించారు. ముందుగా మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులఅర్పించారు. వైఎస్సార్‌సీపీ నేతలు బయిలపూడి భగవాన్ జయరామ్, శరగడం చినఅప్పలనాయుడు, ఉప్పిలి కనకరాజు, గండ్రెడ్డి మహాలక్ష్మినాయుడు, ఉగ్గిన గోవింద్, యతిరాజుల నాగేశ్వరరావు, గొరపల్లి శ్రీను, గొర్లె రామునాయుడు, చొప్పా నాగరాజు, గొరపల్లి సాంబ, మెంటి మహేష్, దాసరి సత్తిబాబు, బండి సత్తిబాబు, రాపర్తి మాధవరావు, కోరాడ చందుయాదవ్, కొయిలాడ శ్రీను, బొడ్డు సూర్యప్రకాష్, కిల్లి అప్పారావు, పాలిశెట్టి సురేష్‌రాజ్, బల్ల రాంబాబు, సూరిశెట్టి సూరిబాబు, దాడి అర్జున్, అవగడ్డ శ్రీనివాస్, కాళ్ల గంగాధర్, ఎస్‌జేడీ శ్రీను, మీసాల విజయ, విజయలక్ష్మి, నక్కా మహేష్, కోన శ్రీను, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి
వంచన చేయడం బాబుకు అలవాటే
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత కేడర్‌దే
పెందుర్తిలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ సభలో
మాజీ ఎమ్మెల్యే శోభా హెమావతి