
దుకాణాల నుంచి ఫ్లెక్సీల వరకు..
ప్రవేశం నుంచి ఆలయం నమూనా వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో పదుల సంఖ్యలో దుకాణాలు నిర్మించేశారు. వీటిని లక్షలాది రూపాయలకు అద్దెలకు ఇచ్చారు. ప్రారంభంలో ఒక్కో దుకాణానికి రూ.2.5 లక్షలు అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆశించిన స్థాయిలో వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొంత తగ్గించి ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా ప్రత్యేకంగా చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేసి ఒక్కో జతకు రూ.5 చొప్పున వసూలు చేశారు. ప్రవేశ రుసుం, చెప్పుల స్టాండ్‌లు వంటివి ఏర్పాటు చేసే సమయంలో సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి. దుకాణాలతో పాటు దారి పొడవుడా వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం సదరు సంస్థల నుంచి లక్షలాది రూపాయలు అద్దె రూపంలో వసూలు చేశారని తెలిసింది. టికెట్ కౌంటర్ కలెక్షన్లు రోజుకి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు జరిగేవని తెలిసింది. వీటికి తగిన పన్నులు చెల్లిస్తున్నారా అనే విషయం ఎక్కడా బయటకు రావడం లేదు. చివరకు ప్రసాదం కూడా విక్రయాలు జరిపారని తెలసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు.

దుకాణాల నుంచి ఫ్లెక్సీల వరకు..