
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో విశాఖ జిల్లాకు చెందిన పలువురికి చోటు లభించింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా చిమట లావణ్య(భీమిలి), వైఎస్సార్‌టీయూసీ జోనల్ ప్రెసిడెంట్‌గా పి.వి.సురేష్(విశాఖ వెస్ట్), వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నక్కా వెంకట రమణ(గాజువాక), వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శులుగా బడిదబోయిన చినఅప్పారావు(విశాఖ సౌత్), కోలా శివ ప్రసాద్(విశాఖ వెస్ట్), వైఎస్సార్‌టీయూసీ జాయింట్ సెక్రటరీగా బడుగు సాయిచంద్(విశాఖ వెస్ట్), బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ తుళ్లి చంద్రశేఖర్ యాదవ్(విశాఖ నార్త్), పోలవరపు శ్రీనివాస్(విశాఖ వెస్ట్), క్రిస్టియన్ మైనారిటీసెల్ జాయింట్ సెక్రెటరీ ఊతపల్లి వేలంగిరావు(విశాఖ సౌత్)ను నియమించారు.