
ఖాళీ భూములతో కాసుల పంట
● భీమిలి, లంకెలపాలెంలోని ఖాళీ భూముల అభివృద్ధి ● పీపీపీ పద్ధతిలో అభివృద్ధికి వీపీటీ టెండర్ల ఆహ్వానం ● ఔషధవనం, మియావాకీ ఫారెస్ట్, రాక్ గార్డెన్‌ల ఏర్పాటు ● మొత్తం 594.98 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటు
8లో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఖాళీ స్థలాల్లో కమర్షియల్ వ్యవహారాలను చేపట్టడం ద్వారా కాసుల పంట పండించుకునేందుకు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ (వీపీటీ) సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ క్రూజ్, సోలార్ సైకిల్ ట్రాక్ వంటివి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా రాక్ గార్డెన్, బ్యాక్ వాటర్‌లో వాటర్ జార్బింగ్, మియావాకీ ఫారెస్ట్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసులు సేదతీరేందుకు సరైన చోటు ఉండేలనేది వీపీటీ ఆలోచనగా ఉంది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ ఖాళీ స్థలాలను అభివృద్ధి చేయాలని వీపీటీ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల (ఈవోఐ)ను ఆహ్వానించింది. త్వరలో టెండర్లను ఖరారు చేసి అటు భీమిలి, ఇటు లంకెలపాలెంలో ఉన్న 594.98 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతోంది.

ఖాళీ భూములతో కాసుల పంట