
దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు
హైదరాబాద్ టు పరవాడ
● దళిత నేత న్యాయపోరాటానికి వాసుపల్లి రూ.10 వేల సాయం ● అజయ్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి
మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కల్తీ మద్యం తయారు చేస్తున్న నిందితులు
హైదరాబాద్ నుంచి స్పిరిట్‌ను 5 లీటర్ల క్యాన్లలో తెప్పించుకుని, దానిలో కారామిల్ అనే రసాయనం కలిపిన వెంటనే ఏసీ బ్లాక్ విస్కీలా రంగు మారిపోతుంది. దానిని మద్యం ఖాళీ క్వార్టర్ (180 మి.లీ.) బాటిళ్లలో వేసి అసలు విస్కీని పోలేలా స్టిక్కర్లు, మూతలు పెట్టి సీల్ చేస్తున్నారు. ఇలా తయారు చేసిన బాటిళ్లను బెల్టు షాపులకు ఒక్కో బాటిల్ రూ.120 నుంచి రూ.130కి విక్రయిస్తున్నారు. దాన్ని బెల్టు షాపుల వాళ్లు వినియోగదారులకు రూ.150 నుంచి రూ.180 వరకూ సరఫరా చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం తయారీతో ఏడు రెట్లు లాభం పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 72 లీటర్ల స్పిరిట్, 455 ఖాళీ బాటిళ్లు, 1389 మూతలు, బాటిళ్లపై అతికించడానికి ముద్రించిన ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, కారామిల్ రసాయనం, యంత్ర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు. నిందితులు ఒక లీటర్ స్పిరిట్ రూ.100కి కొనుగోలు చేస్తున్నారని, 5 లీటర్ల స్పిరిట్‌తో 27 కల్తీ మద్యం క్వార్టర్ బాటిళ్లు తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు. కల్తీ మద్యం తాగితే కాలేయ సంబంధ వ్యాధుల బారిన పడతారని, చివరకు ప్రాణాంతకంగా మారుతుందని సీఐ తెలిపారు. ఇలాంటి కల్తీ మద్యం తయారీ ముఠాల సమాచారం తమకు అందించాలని ఆయన కోరారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంకా నిందితులెవరైనా ఉంటే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
డాబాగార్డెన్స్: చంద్రగిరిలో దళిత కుటుంబంపై జరిగిన అమానుష దాడిని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్, అతని కుటుంబంపై పచ్చ మూకలు చేసిన దాడి అమానుషమన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద న్యాయపోరాటం చేస్తున్న అజయ్‌కుమార్ కుటుంబానికి వాసుపల్లి గణేష్‌కుమార్ తన వంతుగా ఫోన్‌పే ద్వారా రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత కుటుంబాన్ని అవమానించిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దళితులంటే ఎప్పుడూ చిన్నచూపేనని, కూటమి ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. చంటిపిల్ల తల్లి అని కూడా చూడకుండా అజయ్‌కుమార్ భార్యపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పోలీసులు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇటువంటి దాడులు జరగలేదని, చంద్రబాబు, లోకేష్‌ల రెడ్‌బుక్ రాజ్యాంగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
యలమంచిలి రూరల్: ఆస్పత్రుల్లో చేతులు శుభ్రపర్చుకునేందుకు ఉపయోగించే స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పరవాడలో స్థావరం ఏర్పాటు చేసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. బెల్టు షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్ పోలీసులు పలుచోట్ల దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర్నుంచి 72 లీటర్ల స్పిరిట్, కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనపరుచుకున్నారు. యలమంచిలి ఎకై ్సజ్ సీఐ పి.తేజో వెంకటకుమార్ గురువారం సాయంత్రం యలమంచిలిలో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేసిన వివరాలివి.. మాకవరపాలేనికి చెందిన రుత్తల రాము ఉపాధి నిమిత్తం అచ్యుతాపురంలో ఉంటున్నాడు. అక్రమమార్గంలో డబ్బు సంపాదించడానికి కల్తీ మద్యం వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాడు. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేష్‌తో కలిసి కల్తీ మద్యం తయారీ చేస్తున్నాడు. ఇందుకోసం పరవాడలో అద్దెకు ఇంటిని తీసుకున్నారు. ఆ ఇంటిని స్థావరంగా చేసుకుని ఏసీ బ్లాక్ బ్రాండ్ కల్తీ మద్యం తయారు చేసి అచ్యుతాపురం సహా పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో రుత్తల రాము అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా 5 లీటర్ల కల్తీ మద్యం క్యాన్లు పట్టుబడ్డాయి. తర్వాత అతడ్ని విచారించగా పరవాడలో ఒక ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లిన ఎకై ్సజ్ పోలీసులు స్పిరిట్‌తో మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
కల్తీ మద్యం తయారీకి వినియోగిస్తున్న యంత్ర సామగ్రి
మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్
రైతుబజార్లలో పార్కింగ్ నిర్వహణకు టెండర్లు
గోపాలపట్నం : రైతుబజార్లలో వాహనాల పార్కింగ్ నిర్వహణ కోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వేలం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గలవారు రూ.10,000 ధరావత్తును ‘సంయుక్త కలెక్టర్, రైతు బజార్లు, విశాఖపట్నం’ పేరిట డీడీ, లేదా చెక్కు రూపంలో జత చేయాలి. దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందించాలని మార్కెటింగ్ శాఖ తెలిపింది. ఎంవీపీ కాలనీ రైతు బజార్ పార్కింగ్‌కు నెలవారీ అద్దె రూ.1.05లక్షలు, గోపాలపట్నం రూ.80,671, మధురవాడ రూ 4,850, కంచరపాలెం రూ51,750 నిర్ణయించారు. వినియోగదారుల వద్ద వసూలు చేయాల్సిన ధరలు సైకిల్ రూ.2, ద్విచక్రవాహనాలకు రూ.5, ఆటోలకు రూ.10, కార్లకు రూ.20 వసూలు చేయాలని తెలిపింది. వివరాలకు 9959592474, 9030819082 సంప్రదించవచ్చు.
నకిలీ సిగరెట్ల సరఫరా, విక్రయం కేసులో నలుగురి అరెస్ట్
పీఎంపాలెం: ప్రముఖ కంపెనీల బ్రాండ్ పేరుతో నకిలీ సిగరెట్లు సరఫరా, విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పీఎంపాలెం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. ఇంపీరియల్ టొబాకో కంపెనీ(ఐటీసీ) గోల్డ్‌ఫ్లాక్ కింగ్స్ తదితర సిగరెట్లను పలువురు డీలర్ల ద్వారా పాన్ షాపులకు సరఫరా చేస్తోంది. రుషికొండ ఐటీ హిల్స్ రోడ్డులో దుకాణం నడుపుతున్న ఎండాడకు చెందిన రాజు.. ఐటీసీ బ్రాండ్ సిగరెట్ల మధ్య నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సంస్థ ప్రతినిధులు బుధవారం దుకాణం వద్దకు వెళ్లి తనిఖీ చేయగా నకిలీ సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. అతన్ని విచారించగా నగరంలోని శంకరమఠం ప్రాంతానికి చెందిన వెంకటరమణ, కోటేశ్వర గుప్తా తనకు నకిలీ సిగరెట్లు సరఫరా చేస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు వారి షాపుల్లో తనిఖీ చేయగా వారి వద్ద 280 నకిలీ గోల్డ్‌ఫ్లాక్ సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. అదే సమయంలో పీఎంపాలెం ప్రాంతానికి చెందిన మరో దుకాణ దారు పొట్నూరు శివ నకిలీ సిగరెట్లు కొనడానికి వారి వద్దకు వచ్చాడు. అతను కూడా నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సంస్థ ప్రతినిధులు తగిన ఆధారాలతో ఈ నలుగురినీ పీఎంపాలెం పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించగా, వారు మోసానికి పాల్పడినట్లు అంగీకరించారు. ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు.