
వైఎస్సార్ పాలనలో సామాజిక సమానత్వం
– ఎంపీ గొల్ల బాబూరావు
ఏయూక్యాంపస్: దివంగత ముఖ్యమంత్రి, మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనతో రాష్ట్రంలో సామాజిక సమానత్వానికి బాటలు వేశారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా బీచ్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజుతో కలిసి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ అందించిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కె.కె రాజు మాట్లాడుతూ రాజకీయాలకు వన్నె తెచ్చి, ప్రత్యర్థులు సైతం కొనియాడే విధంగా వైఎస్సార్ పాలన సాగించారని గుర్తు చేశారు. ‘తూర్పు’ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ముఖ్య నేతలు కోలా గురువులు, బానాల శ్రీనివాసరావు, ఐహెచ్ ఫరూఖీ, జహీర్ అహ్మద్, బోని శివరామకృష్ణ, పీలా వెంకట లక్ష్మి, రవి రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.