
గిరి ప్రదక్షిణలో సీఎంఆర్ విశేష సేవలు
సాక్షి, విశాఖపట్నం : గిరి ప్రదక్షిణ సందర్భంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో భక్తులకు విశేష సేవలు అందించారు. గిరి ప్రదక్షిణ రహదారిలోని 18వ కిలోమీటరు వద్ద, సీతమ్మధారలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయ నమూనా నిర్మించారు. ఈ ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించడంతో పాటు ఉచితంగా ప్రసాదాలను పంపిణీ చేశారు. సీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా ప్రసాదాలను అందజేశారు.