
‘తొలి అడుగు’ బహిష్కరణ
కొమ్మాది: రుషికొండలో నిర్వహించిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని టీడీపీ వార్డు అధ్యక్షుడు చెట్టిపల్లి గోపి, ఆయన వర్గం బహిష్కరించింది. జీవీఎంసీ 8వ వార్డు రుషికొండలో గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అప్పటి వరకు ప్రజలు వర్షంలో తడుస్తూ ఆయన కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. కాగా.. వార్డులో నెలకొంటున్న రాజకీయాల పరిణామాల నేపథ్యంలో గోపి వర్గం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంది.