జీవీఎంసీ డీడీవోగా ఫణిరామ్ బాధ్యతల స్వీకరణ
డాబాగార్డెన్స్: జీవీఎంసీ డీడీవోగా ఎం.వి.డి.ఫణి రామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ వ్యక్తిగత కారణాలతో ఈ నెల 24 వరకు సెలవులో ఉండటంతో, ఆయన నిర్వహిస్తున్న డీడీవో బాధ్యతలను జీవీఎంసీ డీపీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం.వి.డి.ఫణిరామ్‌కు పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగిస్తూ జీవీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జీవీఎంసీ అదనపు కమిషనర్ (ఫైనాన్స్) బాధ్యతలను జీవీఎంసీ అదనపు కమిషనర్ (జనరల్) డి.వి. రమణమూర్తికి అప్పగించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.


