టాలెంటెడ్ గేమ్ పేరుతో దోపిడీ
కూర్మన్నపాలెం : టాలెంట్‌డ్ గేమ్ పేరుతో కూర్మన్నపాలెంలో భారీ ఎత్తున గలాట జరుగుతోంది. స్థానిక జనసేన నాయకుడు ఇంట్లో రోజూ సాయంత్రం వేళ వందలాది మంది ఆడుతున్నారు. కొందరు వేలాది రూపాయలు నష్టపోతుండగా.. నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకుని యథేచ్ఛగా సాగుతున్న ఈ గులాటకు అన్ని అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. న్యాయస్థానం కూడా అనుమతిచ్చిదంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారు. అందువల్లే పోలీసులు కూడా అటు వైపు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీని వలన ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలెంటెడ్ పేరుతో ఆడిస్తున్న ఈఽ దందాకు కొందరు పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే పెదగంట్యాడ పరిధి దయాల్ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయ సమీపంలో కూడా కొంతమంది ఇదే టాలెంటెడ్ గేమ్ ఆడిస్తూ రోజూ లక్షల్లో దోచుకుంటున్నారు. ఇక్కడ కూడా పోలీసులు సహకారం ఉందనే స్థానికులు చెబుతున్నారు.


