
మహారాజా బ్యాంకుకు అవార్డులు
విశాఖసిటీ: ది మహారాజా కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. ‘బెస్ట్ చైర్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’ , ‘బెస్ట్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ – ఆంధ్రప్రదేశ్ స్టేట్’ అవార్డులను శుక్రవారం ముంబైలో జరిగిన ‘భారత్ రత్న సహకారిత సమ్మాన్ 2025’ కార్యక్రమంలో అందుకున్నారు. బ్యాంకు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డులు రావడం సంతోషంగా ఉందని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా 999 రోజులకు 9 శాతం వడ్డీతో ‘మహారాజా స్పెషల్ డిపాజిట్ స్కీం’ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.492 కోట్లుగా, నికర లాభం రూ.3.24 కోట్లుగా వెల్లడించారు. త్వ రలో విజయవాడ, రాజమండ్రి, రామచంద్రాపురంల లో కొత్త శాఖలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.