
ముగిసిన అంతర హోటల్స్ క్రికెట్ టోర్నీ
విశాఖ స్పోర్ట్స్: హోటల్స్, రెస్టారెంట్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర హోటల్స్, రెస్టారెంట్స్ క్రికెట్ టోర్నీ విజేతగా పామ్‌బీచ్ హోటల్ జట్టు, రన్నరప్‌గా నోవాటెల్ జట్టు నిలిచాయి. మున్సిపల్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పామ్‌బీచ్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 7వికెట్లకు 126 పరుగులు చేసింది. ప్రతిగా నోవాటెల్ భీమిలి రిసార్ట్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 85 పరుగులే చేయగలిగింది. 16 హోటల్స్, రెస్టారెంట్ల జట్లు టోర్నీలో పాల్గొన్నాయని సంఘం ఉపాధ్యక్షుడు పవన్‌కార్తీక్ తెలిపారు.