
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
సీతమ్మధార: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిచారు. ఏడీఎఫ్‌వో పి.సింహాచలం ఆధ్వర్యంలో సిబ్బంది పలు విన్యాసాలు చేశారు. 90 మీటర్ల ఎత్తైన ప్రదేశాల్లో ప్రమాదంలో చిక్కుకున్న వారిని బ్రాంటో స్కైలిఫ్ట్ ద్వారా ఎలా రక్షించవచ్చో చూపించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించాల్సిన పరికరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను నివాసితులకు వివరించారు. అగ్నిప్రమాద భద్రతపై రూపొందించిన కరపత్రాలు పంచిపెట్టారు.