ఏయూ పరువు తీస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ఏయూ పరువు తీస్తున్నారు

Jul 26 2025 9:42 AM | Updated on Jul 26 2025 10:12 AM

ఏయూ పరువు తీస్తున్నారు

ఏయూ పరువు తీస్తున్నారు

డాబాగార్డెన్స్‌: ఏయూ ప్రొఫెసర్‌ వేధింపుల కారణంగా విద్యా సంవత్సరం నష్టపోయి ఆత్మహత్యాయతాంనికి పాల్పడి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి అభిషేక్‌ను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, పలువురు పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం పరామర్శించారు. అభిషేక్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం అభిషేక్‌ తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అభిషేక్‌కు జరిగిన అన్యాయా న్ని ఏయూ వీసీ దృష్టికి తీసుకెళ్తామని కేకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా విశ్వవిద్యాలయం హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం, పురుగులు కలిసిన అన్నం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై విద్యార్థులు ప్రధాన గేటు వద్ద ధర్నా చేసి రాత్రంతా అక్కడే గడిపిన విషయాన్ని గుర్తు చేశారు. అభిషేక్‌ వంటి 95 శాతం మార్కులతో బాగా చదివే విద్యార్థికి పూర్తి అటెండెన్స్‌ ఉన్నప్పటికీ, అతను చేయని తప్పుకి ప్రొఫెసర్‌ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేయడం విశ్వవిద్యాలయానికే చెడ్డ పేరు తెచ్చిందని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ఎంతో పేరెన్నికగన్న ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రతిష్ట గత ఏడాదిగా దిగజారిందని ఆయన విమర్శించారు. ఏయూలో గత ఏడాదిగా జరుగుతున్న ఘటనలను పచ్చ మీడియానే ప్రచురించిందంటే విద్యా శాఖ మంత్రి లోకేష్‌, సీఎం చంద్రబాబు పాలనా తీరు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ మెరుగ్గా ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని కేకే రాజు ఆరోపించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, జీవీఎంసీ వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు చెన్నా జానకీరామ్‌, పీవీ సురేష్‌, బిపిన్‌కుమార్‌ జైన్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్‌, పేడాడ రమణికుమారి, బోని అప్పలనాయుడు, సనపల రవీంద్రభరత్‌, బోని శివరామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, కర్రి రామారెడ్డి, రాయపురెడ్డి అనీల్‌కుమార్‌, వడ్డాది దిలీప్‌కుమార్‌, వంకాయల మారుతీప్రసాద్‌, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, దేవరకొండ మార్కండేయలు, పల్లా దుర్గారావు, మనలత జోబ్దాస్‌, ఇమంది సత్యనారాయణ, పులగం శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి వర్మ, కంచుమూర్తి పద్మ శేఖర్‌, సంపంగి సురేష్‌, పులగం సూర్యనారాయణరెడ్డి, సూర్య, మహేష్‌, కొయ్య చిన్ని పాల్గొన్నారు.

ఆస్పత్రిలో అభిషేక్‌ను పరామర్శించిన

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

ఏయూ విశిష్టతను కాపాడండి

మద్దిలపాలెం: ఏయూలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు విశ్వవిద్యాలయం ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. ఏయూ విద్యార్థి ఆత్మహత్యాయత్నం, భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో, శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకుల బృందం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని కేజీహెచ్‌లో పరామర్శించింది. అనంతరం ఏయూ వీసీని కలిసి విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వీసీ చాంబర్‌లోకి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను, సీనియర్‌ నాయకులను అనుమతించకపోవడంపై కేకే రాజు వీసీ తీరును తప్పుపట్టారు. ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. దీనికి వీసీ, అలాంటిదేమీ లేదు, అందరూ రావచ్చని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement