అనకాపల్లి టౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు ద్వారా రూ.41,51,973ల నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు నెల రోజుల్లో నగదు రూపంలో ఈ మొత్తం వచ్చిందని, ఇంకా 15.5 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి వస్తువులను భక్తులు సమర్పించినట్టు తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగ శ్రీను, కమిటీ సభ్యులు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వరావు, యూనియన్ బ్యాంకు సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.