
రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏయూక్యాంపస్ : అరకు మండలంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. రైలులో విశాఖకు వచ్చిన గవర్నర్‌కు వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోర్టు గెస్టు హౌస్ చేరుకున్న గవర్నర్‌ను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోర్టు గెస్టు హౌస్ నుంచి రోడ్డుమార్గంలో అరకు మండలం పద్మపురం పంచాయతీ పరిధిలోని యండపల్లివలస రైల్వే గెస్టు హౌస్‌కు వెళ్తారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.