
రైళ్లు రద్దు కావడంతో ఖాళీగా ఉన్న ప్లాట్‌ఫాం
తాటిచెట్లపాలెం: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద దృష్ట్యా ఆయా స్టేషన్లలో బయల్దేరాల్సిన పలు రైళ్లు ఆదివారం కూడా రద్దయినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆదివారం బయల్దేరాల్సిన హౌరా–బెంగళూరు(12245) దురంతో ఎక్స్‌ప్రెస్, హౌరా–హైదరాబాద్ (18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, సంత్రగచ్చి–తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్, షాలిమార్– చైన్నె సెంట్రల్ (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హౌరా(18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, చైన్నె సెంట్రల్ –షాలిమార్ (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి –సంత్రగచ్చి (22856) ఎక్స్‌ప్రెస్, విల్లుపురం– పురూలియా (22605) మెయిల్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు
► హౌరా–తిరుచ్చిరాపల్లి (12663) ఎక్స్‌ప్రెస్ వయా జార్సుగూడ, సంబల్‌పూర్, టిట్లాఘడ్, విజయనగరం మీదుగా నడుస్తోంది.
► అగర్తలా–బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్ వయా జార్సుగూడ, సంబల్‌పూర్, టిట్లాఘడ్, విజయనగరం మీదుగా నడుస్తోంది.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు
► బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరాల్సిన బెంగళూరు–జసిద్ది (22305) ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
► బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరాల్సిన బెంగళూరు– హౌరా(12864) 2.25 గంటల ఆలస్యంగా బయల్దేరింది.
► బెంగళూరులో ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయల్దేరాల్సిన బెంగళూరు–హౌరా(12246) ఎక్స్‌ప్రెస్ 2.10 గంటల ఆలస్యంగా బయల్దేరింది.